![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -113 లో.... మాధవని కలవడానికి గాయత్రి వస్తుంది. కన్నా తనని చూసి మళ్ళీ ఎందుకు వచ్చిందోనని తప్పుగా అర్థం చేసుకొని చక్రి, కేశవకి ఫోన్ చేసి చెప్తాడు. బావ ఇక దుబాయ్ వెళ్ళిపోతాను చెప్పి వెళదామని వచ్చానని గాయత్రి చెప్తుంది. నీ భర్త నీతో ఎంత సన్నిహితంగా ఉన్నా మన మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పకు.. ఎందుకంటే ఒకసారి తెలిస్తే అది పురుగులా వ్యాపించి మీ జీవితాన్ని నాశనం చేస్తుందని మాధవ చెప్తాడు. సరే బావ అని గాయత్రి వెళ్ళబోతు బావ నువ్వు పెళ్లి చేసుకో అంటుంది. ఆ మాట కన్నా విని తనని చేసుకోమని అంటుందేమో అని తప్పుగా అర్థం చేసుకొని బయటకు వెళ్లి టెన్షన్ పడుతాడు. నాకు మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటానని మాధవ చెప్తాడు.
గాయత్రి మీరు ఇద్దరు మా ఇంటికి భోజనంకి రండి అని మాధవ పిలుస్తాడు. సరే అని గాయత్రి చెప్తుంది. గాయత్రి వెళ్ళిపోయాక చక్రి మహా, కేశవ వస్తారు. ఇందాక ఎవరు వచ్చారు అన్నయ్య అని మాధవని చక్రి, కేశవ అడుగుతారు. గాయత్రి వచ్చింది భార్యాభర్తలని భోజనానికి పిలిచానని మాధవ చెప్పగానే ఎందుకు అన్నయ్య నిన్ను ప్రేమించిన అమ్మాయిని భర్తతో భోజనానికి పిలవడం ఏంటని చక్రి, కన్నా కోప్పడుతారు. పిలిస్తే తప్పేంటి అని మహా అంటుంది. తను పెళ్లి వద్దని వస్తే మీ అన్నయ్య వెళ్ళిపొమ్మనగానే తలవంచుకొని వెళ్ళిపోయింది. పెద్ది త్యాగం ఎంతుందో గాయత్రిది కూడా అంతే ఉందని మహా అంటుంది.. ఆ తర్వాత మహా, మాధవ కలిసి భోజనానికి ఏర్పాట్లు చేస్తారు. ఏంటి ఇన్ని రకాల వంటలు చేస్తున్నారని నారాయణ అడుగుతాడు. గాయత్రి తన భర్తతో భోజనానికి వస్తుందని మాధవ చెప్పగానే నారాయణ కోప్పడతాడు. ఆపు నాన్న నా ఇంట్లో నాకు నచ్చిన వాళ్ళని పిలిచి భోజనం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా అని మాధవ కోప్పడతాడు. దాంతో అందరు సైలెంట్ అయిపోతారు.
మరొకవైపు గాయత్రి రెడీ అయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆయనతో బయటకు వెళ్తున్నానని చెప్తుంది. ఆ మాట విని తాయారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడికి అని తాయారు అడుగుతుంది. మాధవ బావ భోజనానికి పిలిచాడని గాయత్రి చెప్తుంది. వద్దని తాయారు కోప్పడుతుంది. అక్కడికి వెళ్తే మాధవ నువ్వు ప్రేమించుకున్న విషయం తెలుస్తుందని తాయారు అనగానే అప్పుడే గాయత్రి భర్త వినోద్ వచ్చి నాకు తెలుసు అనగానే అందరు షాక్ అవుతారు. మాధవ అంటున్నారు తను భోజనం గురించి పిలిచాడనే కదా మాట్లాడుకుంటున్నారు చివరలో మాధవ అని వినిపించింది భోజనం గురించి ఏమో అనుకొని తెలుసు అన్నానని వినోద్ అంటాడు. తాయారు వాళ్ళు హమ్మయ్య వినలేదని అనుకుంటారు. గాయత్రి తన భర్తని తీసుకొని మాధవ ఇంటికి భోజనానికి వెళ్తుంది. అందరు గాయత్రి ఇంకా తన భర్తతో బాగా మాట్లాడతారు. అందరు కలిసి భోజనం చేస్తారు. తరువాయి భాగంలో మహాని చూడడానికి హారిక ఇంటికి వస్తుంది. అక్కడ వాతావరణం చూసి ఇక్కడ ఎలా ఉంటున్నావ్.. మా ఫ్రెండ్ దగ్గర ఉండమని సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |